భారతీయులకు రష్యాలోకి 'వీసా-ఫ్రీ-ఎంట్రీ' 2 d ago
వచ్చే ఏడాది.. 2025 నుంచి భారతీయులకు 'వీసా-ఫ్రీ-ఎంట్రీ' ని రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రష్యా ప్రకటించిన వీసా రహిత ప్రవేశం దేశాల జాబితాలో, భారత్ సహా మరో 62 దేశాలు ఉన్నాయి. కేవలం పాస్పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకున్నవాళ్ళు, అక్కడి ఎయిర్పోర్ట్ లో 'వీసా-ఫ్రీ-ఎంట్రీ' కి దరఖాస్తు చేసుకోవాలి. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా మరియు పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చల ఫలితమే ఇది.
ఎక్కువగా భారతీయులు వ్యాపారం కోసం, పర్యటన కోసం రష్యాకు వెళుతుంటారు. అయితే, 2023 ఆగస్టు నుంచి రష్యా వెళ్లేందుకు భారతీయులకు ఇ-వీసా వెలుసుబాటు ఉంది. 2023లో రికార్డు స్థాయిలో 60,000 మంది భారతీయులు మాస్కోను సందర్శించారు. ఇది 2022 కంటే 26 శాతం ఎక్కువ. రష్యాకు ఎక్కువ మంది ప్రయాణించే నాన్- సీఐఎస్ దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. 2024 మొదటి త్రైమాసికంలోనే భారతీయులకు దాదాపు 1,700 ఈ-వీసాలు జారీ చేయబడ్డాయి. రష్యా ప్రస్తుతం వీసా రహిత పర్యాటక మార్పిడి కార్యక్రమం ద్వారా చైనా, ఇరాన్ నుండి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. ఇప్పుడు రష్యా కూడా భారత్తో వీసా రహిత ప్రయాణాన్ని పరిశీలిస్తోంది. భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు.